తుంగభద్రకు కొత్త బలం

33 కొత్త గేట్లను జాతికి అంకితం చేసిన మూడు రాష్ట్రాల నేతలు రైతులకు భరోసా.. నీటి భద్రతకు మరింత బలం సాగునీటి నిర్వహణలో కీలక మైలురాయిగా నిలిచిన ఆధునీకరణ దక్షిణ భారతదేశ వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన తుంగభద్ర జలాశయం ఆధునీకరణలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జలాశయంలో అమర్చిన 33 కొత్త రేడియల్ గేట్లను గురువారం కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రముఖ నేతలు సంయుక్తంగా ప్రజలకు అంకితం చేశారు. ఈ ఆధునీకరణతో జలాశయ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటి పరంగా దీర్ఘకాలిక భరోసా లభించనుంది. హొస్పేట్ సమీపంలోని తుంగభద్ర జలాశయం 18వ గేటు వద్ద నిర్వహించిన...