మాదకద్రవ్యాల ముప్పు.. యువత భవిష్యత్తుకు పెను సవాల్!

జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా" మన విశ్వం" ప్రత్యేకం వ్యసనాల బారిన పడుతున్న యువత.. కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం అవగాహన, కఠిన చర్యలు, సమిష్టి బాధ్యతతోనే నిర్మూలన సాధ్యం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సామాజిక సమస్యల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం ఒకటి. ఒకప్పుడు కొద్ది వర్గాలకే పరిమితమైన ఈ ముప్పు ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా సమాజంలోని ప్రతి వర్గానికీ విస్తరించింది. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల వ్యసనానికి బానిస కావడం దేశ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు...