ఓటీటీలో ఈ వారం వినోదాల సందడి.. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులకు పండుగ!

ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలలు లేకపోయినా, ఓటీటీ వేదికలు మాత్రం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 15కు పైగా కొత్త చిత్రాలు, సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్‌కు రానుండటంతో వినోద ప్రియులకు ఈ వారాంతం ప్రత్యేకంగా మారింది. మరోవైపు థియేటర్లలో సూపర్ హిట్ చిత్రాలు ‘ఒక్కడు’, ‘సినిమా చూపిస్త మావ’ రీ-రిలీజ్ కానున్నాయి. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: టార్చ్‌బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ చిత్రాల నిర్మాణ విశేషాలు, యుద్ధ సన్నివేశాల రూపకల్పన, నటీనటుల అనుభవాలు, తెరవెనుక కథనాలతో...