ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: విజయశాంతి

హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలి ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలకు డిమాండ్ ప్రైవేట్ కళాశాలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి కోరారు. న్యాయస్థానం సూచనలను అమలు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారి విద్యా సంవత్సరం దెబ్బతినకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజయశాంతి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆమె అన్నారు....