నీట్ రీ పరీక్ష ఆన్సర్ కీ విడుదల.. జూన్ 28 వరకు అభ్యంతరాలకు అవకాశం
నీట్ యూజీ–2026 రీ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జూన్ 21న నిర్వహించిన రీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని భావించే అభ్యర్థులకు అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్‌టీఏ కల్పించింది. ఈ నెల జూన్ 28 రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపింది. ప్రతి ప్రశ్నపై సవాలు చేయడానికి రూ.200 చొప్పున ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను కూడా తప్పనిసరిగా జత చేయాలని...