ఇందిరమ్మ ఇళ్లకు కొత్త నిబంధనలు
500–750 చదరపు అడుగులకే స్లాబ్ పరిమితి ఇంటి ముందు రేకుల షెడ్డు నిర్మాణానికి అనుమతి గృహ నిర్మాణశాఖ తాజా ఉత్తర్వులు నేటి నుండి అమల్లోకి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేలా ఇళ్ల స్లాబ్ విస్తీర్ణంపై కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ ఉత్తర్వులు విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ విస్తీర్ణం కనిష్ఠంగా 500 చదరపు అడుగులు, గరిష్ఠంగా 750 చదరపు అడుగుల వరకు మాత్రమే ఉండాలి. ప్రభుత్వం ఆమోదించిన...