కేటీఆర్‌కు తీవ్ర జ్వరం.. వరంగల్ జిల్లా పర్యటన వాయిదా!

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు (సోమవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టాల్సిన పార్టీ పర్యటన, కీలక సమావేశాలు వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ​వాయిదా పడిన సమావేశాలు ​వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం. ​మహబూబాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం. ​డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం. ​ వాయిదా పడిన ఈ సమావేశాలను ఇదే వారంలో మరో తేదీన నిర్వహించనున్నారు. సవరించిన తేదీలు, సమయాలకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ​కేటీఆర్ గారు తీవ్ర అస్వస్థతకు గురికావడం...