మోదీకి సెషెల్స్ అత్యున్నత అధ్యక్ష పురస్కారం
‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారైజన్’ గౌరవం అందజేత పర్యావరణ పరిరక్షణ, బ్లూ ఎకానమీకి విశేష కృషికి గుర్తింపు ఈ గౌరవాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంకితం చేసిన ప్రధాని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెషెల్స్ ప్రభుత్వం అత్యున్నత అధ్యక్ష పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారైజన్’ను ప్రదానం చేసింది. సెషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రధానికి అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, సముద్ర వనరుల సుస్థిర వినియోగం, బ్లూ ఎకానమీ అభివృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యల్లో భారత్ చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ చేసిన...