బావబామ్మర్దులు తోడేళ్లలా తెలంగాణపై పడ్డారు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కంటే విధ్వంసానికే ప్రాధాన్యం ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, "బావబామ్మర్దులు తోడేళ్లలా తెలంగాణపై పడ్డారు" అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా శాశ్వతంగా తిరస్కరించారని, వారికి మరోసారి అధికార బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ పాలనపై...