'బెయిల్ భయం'తోనే 2,900 ఎకరాలు కేంద్రానికి అప్పగించారు

వికారాబాద్ అడవులు, మూసీ నది, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశాలపై తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెయిల్ రద్దవుతుందనే భయంతోనే వికారాబాద్ జిల్లాలోని 2,900 ఎకరాల భూమిని దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కోసం అప్పగించారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దామగుండం రాడార్ ప్రాజెక్టు కోసం 12 లక్షల చెట్ల నరికివేతకు మాజీ సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం...