లాభాల బాటలో దూసుకెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ
కొన్నేళ్ల పాటు వేల కోట్ల రూపాయల నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడు లాభాల బాటలో వేగంగా దూసుకెళ్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం, మహిళలకు అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం, సంస్థ చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యలు కలిసి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపర్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,059.27 కోట్ల మిగులు సాధించి చరిత్రలోనే అత్యధిక లాభాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్న ఆర్టీసీ యాజమాన్యం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,118.86 కోట్ల నికర మిగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది....