రూ. 2 లక్షలు లంచం.. ఏసీబీకి దొరికిన అశ్వారావుపేట ఇరిగేషన్ ఏఈఈ!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. చెరువు మట్టి తవ్వకాల అనుమతి కోసం ఏకంగా రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి, ఆ డబ్బును తీసుకుంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అసలు ఏం జరిగిందంటే? అశ్వారావుపేట మండలానికి చెందిన ఒక వ్యక్తి, తన మామగారి వ్యవసాయ భూమిని పౌరుషం చేసుకోవడం కోసం దానికి ఆనుకుని ఉన్న 'దొంతికుంట' చెరువు నుండి మట్టిని తవ్వుకోవాలని భావించాడు. ఆ మట్టితో తన పొలంలో ఉన్న గుంతలను పూడ్చుకోవడానికి రవాణా అనుమతి (పర్మిషన్) ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ సబ్-డివిజన్-I ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న లచ్చుబుక్త...