యాదాద్రి దేవస్థానానికి కొత్త పాలకమండలి.. బోర్డు సభ్యురాలిగా కొణిదెల సురేఖ

యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాలక మండలిని నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం నిబంధనల మేరకు కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాలక మండలికి ఎం.సత్యనారాయణ రెడ్డి ని ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్‌తో పాటు నామినేటెడ్ సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 18 మందితో ఈ బోర్డు ఏర్పాటైంది. నామినేటెడ్ సభ్యులుగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలపగారి విజయరాజం, విజయేందర్ తుల్లా,...