తెల్లకోటు వెనుక మహోన్నత సేవ
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం దేశవ్యాప్తంగా వైద్యులకు ఘన నివాళి ఆరోగ్య సేవల్లో విశేష కృషికి గుర్తింపుగా ప్రత్యేక కార్యక్రమాలు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ సేవలను స్మరించుకుంటూ వేడుకలు దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేడు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ఆరోగ్య సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖ వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినం, వర్ధంతి ఒకే...