కాళేశ్వరం కమీషన్ల కోసమే.. రైతుల కోసం కాదు: సీఎం రేవంత్
రూ.9 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు కేసీఆర్, మోదీపై ఒకేసారి విమర్శలు శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా నిర్మించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నప్పటికీ, తెలంగాణ ప్రస్తుతం వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రైతుల కష్టానికి నిదర్శనమని అన్నారు. బోర్ల కింద సాగు చేసిన పంటలకూ కాళేశ్వరం ఘనతగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు భరోసా నిధుల పంపిణీని...