కుడా భూముల వేలంలో రూ.50 కోట్ల అవినీతి?
భద్రకాళి గుడిలో ప్రమాణానికి నేను సిద్ధం.. కాంగ్రెస్ నేతలకు దమ్ముందా?:కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవారెడ్డి సవాల్ బాలసముద్రం భూముల విక్రయంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి సిండికేట్‌గా మారి మార్కెట్ ధర కంటే సగానికే కొట్టేశారు! వేలాన్ని రద్దు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బాలసముద్రం భూముల వేలంలో భారీ అవినీతి చోటుచేసుకుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, కుడా మాజీ ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు పథకం ప్రకారం వేలం ప్రక్రియను ప్రభావితం చేసి, ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొట్టారని విమర్శించారు. మంగళవారం...