ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్: నెల తొలి రోజే జీతాలు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, గౌరవ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల తొలి రోజైన బుధవారం జీతాలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. జీతాల చెల్లింపులో తరచూ ఎదురవుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతన సిబ్బందికి కూడా ప్రతి నెల జీతాలు ఆలస్యం కాకుండా అందేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు...