ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పొన్నం కౌంటర్: ‘మాజీ మంత్రులు వస్తేనే చర్చకు సిద్ధం..!’ ​

సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విసిరిన సవాలును రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. అయితే, ఈ చర్చకు ప్రవీణ్ కుమార్‌ కాకుండా, బాధ్యతగల మంత్రులుగా పని చేసిన ఆ పార్టీ మాజీ మంత్రులు వస్తేనే తాము ప్రెస్ క్లబ్ వేదికగా చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు.​ఈ మేరకు పొన్నం ప్రభాకర్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా కష్టపడి పైకొచ్చిన బలహీన వర్గాల నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ​శాసనసభలోనే తేల్చుకుందాం.. లేదా ప్రెస్ క్లబ్‌కు రండి! ​మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా వేదికగా...