కీలక నిర్ణయాలతో రాష్ట్ర క్యాబినెట్..!

వీబీజీ చట్టం అమలు.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం–భోజనం.. టిమ్స్ ఆస్పత్రులకు 6,278 పోస్టులు మూసీ అభివృద్ధి తొలి దశకు రూ.7,345 కోట్లకు ఆమోదం హైదరాబాద్, జూలై 2 (మన విశ్వం): రాష్ట్ర మంత్రివర్గం గురువారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ఆమోదం తెలుపుతూనే, ఆ చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికీ అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు 6,278 పోస్టులు, మూసీ రివర్‌ఫ్రంట్ తొలి దశ...