'బాస్' లేని వరంగల్ పోలీసింగ్..!
రెండు నెలలుగా ఖాళీగా ఏసీపీ పోస్టు.. ఇన్‌ఛార్జ్‌తోనే సబ్‌డివిజన్ పరిపాలన వరంగల్ ప్రతినిధి, జులై2(మన విశ్వం):వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన వరంగల్ సబ్‌డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) పోస్టు గత రెండు నెలలుగా ఖాళీగా ఉండటం పోలీసు పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సబ్‌డివిజన్‌కు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో ప్రస్తుతం హనుమకొండ ఏసీపీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వరంగల్ డివిజన్‌లో పోలీసు పరిపాలన ఇన్‌ఛార్జ్ వ్యవస్థకే పరిమితమైందని, ప్రజలకు సత్వర సేవలు అందడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వరంగల్ సబ్‌డివిజన్‌కు తొలి ఐపీఎస్ అధికారిగా పనిచేసిన శుభం ప్రకాశ్ ఈ ఏడాది ఏప్రిల్ 21న బదిలీపై వెళ్లిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం...