డీఎస్పీ ‘అవినీతి సామ్రాజ్యం’ బద్దలు!

డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్.. రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తుల గుట్టురట్టు తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ ఇళ్లపై ఏకకాలంలో దాడులు హైదరాబాద్–బెంగళూరు సహా 15 ప్రాంతాల్లో సోదాలు.. రహస్య డైరీతో 15 మంది బినామీల గుర్తింపు 2 కిలోల బంగారం, భారీ నగదు, విలాసవంతమైన ఆస్తుల పత్రాలు స్వాధీనం హైదరాబాద్, జూలై 2 (మన విశ్వం): తెలంగాణలో మరో సంచలన అవినీతి కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెలుగులోకి తీసుకొచ్చింది. తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పనిచేస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ స్థాయిలో ఏసీబీ అధికారులు సోదాలు...