బావబామ్మర్దుల 'ఆధిపత్య' డ్రామాలు!
'డ్రామారావు', 'అగ్గిపెట్టె రావు'లకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారు అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. చర్చలకు భయపడి పారిపోయేది మీరే! ఫార్మ్‌హౌస్ రాష్ట్ర సమితి (FRS)గా మారిన గులాబీ పార్టీ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా కొల్లగొట్టి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు అధికారంలో ఉన్నామనే భ్రమలో ప్రతిరోజూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వారి పేర్లకు తగ్గట్టే ఇద్దరూ...