'కుడా' సవాల్ రచ్చ.. మర్రి యాదవరెడ్డి అరెస్ట్! భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత
వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి దేవస్థానం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదం.. సవాళ్లు, ప్రతిసవాళ్లు దాటి పోలీసుల అరెస్టుల వరకు దారితీసింది. వివాదం నేపథ్యం: రూ. 50 కోట్ల కుంభకోణం ఆరోపణలు 'కుడా'ప్రభుత్వ భూముల వేలంలో సుమారు రూ. 50 కోట్ల మేర కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ అవినీతి ఆరోపణలపై తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు, భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని ఆయన బీఆర్ఎస్ నాయకులకు బహిరంగ...