అంగన్‌వాడీలకు కేంద్ర సాయం పెంచాలి
కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క భేటీ చిన్నారుల అల్పాహార పథకానికి నిధులివ్వాలని విజ్ఞప్తి బాలికల్లో రక్తహీనత నివారణకు రూ.100 కోట్లు కేటాయించాలి తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వీరికి మరింత మెరుగైన సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆమె.. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించిన సీతక్క, వాటికి సంబంధించిన వినతిపత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు. అల్పాహార పథకానికి భరోసా కల్పించండి రాష్ట్రంలోని...