​నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దు!

రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడే యువతలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాలకు చెందినవారేనని, రేయింబవళ్లు కష్టపడి చదువుతున్న వారి భవిష్యత్తుతో ఆటలాడొద్దని సూచించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే తెలంగాణ ఉద్యమ నినాదాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ​హామీలు ఇక్కడే.. భర్తీ ఎక్కడ? ​రాష్ట్రంలో 17 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించినా, ఇప్పటివరకు వాటిని భర్తీ చేయడంలో...