ముఖ్యమంత్రి విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్‌పై బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మద్రాస్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కొద్దిసేపటికే ఈ అరెస్ట్ జరిగింది. వివాదం నేపథ్యం ఏమిటి? జూన్ 20న మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతిని పురస్కరించుకుని తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూర్‌లో ఓ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ప్రవర్తనను, ఆయన సినీ రంగం నేపథ్యాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రసంగానికి...