ఢిల్లీ మెట్రోలో కలకలం: దేశీయ తుపాకీ, తూటాతో ఇద్దరి అరెస్ట్!

Delhi metro ఢిల్లీ మెట్రోలో భారీ భద్రతా లోపం బయటపడింది. మండీ హౌస్ మెట్రో స్టేషన్‌లో శనివారం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద దేశీయ తుపాకీ (కట్టా), ఒక సజీవ తూటా లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది సమయస్ఫూర్తితో నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ​తనిఖీల్లో దొరికిపోయిన నిందితులు ​మండీ హౌస్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తుండగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ఎక్స్-రే మిషన్‌లో ఒక అనుమానాస్పద వస్తువు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, సదరు బ్యాగుకు సంబంధించిన ఇద్దరు ప్రయాణికులను పక్కకు పిలిచి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.వారి వద్ద ఒక దేశీయ తుపాకీ, ఒక సజీవ...