50 మంది యువతుల చదువు బాధ్యత తీసుకున్న కేటీఆర్‌ది

ఆర్థికంగా వెనుకబడిన 50 మంది యువతుల ఉన్నత చదువులు, వారి సాధికారత బాధ్యతను వ్యక్తిగతంగా స్వీకరిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తన 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘ఎస్‌పార్సా–2026’ వార్షిక సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి బాధ్యతాయుత పౌరుడి కర్తవ్యమన్నారు. విద్య ద్వారానే మహిళల జీవితాల్లో శాశ్వత మార్పును, ఆర్థిక సామాజిక సాధికారతను తీసుకురావచ్చని ఆకాంక్షించారు. ‘టచ్ ఏ లైఫ్’ అనే ఉన్నతమైన భావనతో పనిచేస్తున్న ఎస్‌పార్సా సంస్థ సేవలను ఈ సందర్భంగా కేటీఆర్...