​డిప్యూటీ సీఎం కాన్వాయ్ రూట్ మార్పు.. ఎస్‌ఐపై వేటు!

సూర్యాపేట జిల్లాలో కలకలం.. డిప్యూటీ సీఎం కాన్వాయ్ రూట్ మార్పు కోదాడ రూరల్ ఎస్‌ఐ వీఆర్‌కు బదిలీ.. డీజీపీకి భట్టి ఫిర్యాదు! ​ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భద్రతా ప్రోటోకాల్‌లో చోటుచేసుకున్న తీవ్ర లోపం పోలీసు శాఖలో కలకలం రేపింది. డిప్యూటీ సీఎం కాన్వాయ్ మార్గాన్ని ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాకుండా మరో రూట్‌లోకి మళ్లించిన ఘటనపై ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ కోదాడ రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) గోపాల్‌ను లూప్ లైన్‌లోకి నెడుతూ.. వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్)కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ​రూట్ మార్చడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం సూర్యాపేట...