నిరాడంబర రాజకీయాల శిఖరం.. కొణిజేటి రోశయ్య!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతి (జూలై 4) నేడు. ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం నిజాయితీకి, నిరాడంబరతకు, ఆర్థిక క్రమశిక్షణకు ఒక నిలువెత్తు నిదర్శనం. రోశయ్య గారి రాజకీయ ప్రస్థానం 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు సమీపంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే యువజన ఉద్యమాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, శాసనమండలి సభ్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక, రవాణా, విద్యుత్ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలపై ఆయనకున్న పట్టు అసాధారణం. దేశంలోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన...