తడిబట్టల డ్రామాలతో ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.. భద్రకాళి క్షేత్రాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు

రాజకీయ స్వార్థం కోసం ఆలయాన్ని వాడుకోవడం హేయమైన చర్య ​అమ్మవారి ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు ​సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన నేతలపై మండిపాటు ​ భారతదేశంలోనే చరిత్ర ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం, ఓరుగల్లు నగర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ రాజకీయ ఉనికి కోసం, ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం ఆలయ నియమాలను తుంగలో తొక్కి, భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగించిన ఇరు పార్టీల...