భర్తను చంపి, బాత్‌రూమ్ కింద పాతిపెట్టిన భార్య..!
పాయసంలో నిద్రమాత్రలు కలిపి దారుణం గొంతు నులిమి హత్య.. ఇంట్లోనే ఖననం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగుచూసింది. భర్తను అత్యంత కిరాతకంగా చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోని బాత్‌రూమ్ కిందే పాతిపెట్టిన ఓ మహిళ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పక్కా స్కెచ్‌తో హత్య.. పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. సదరు మహిళ తన భర్తను వదిలించుకోవాలని పక్కా ప్రణాళిక వేసుకుంది. ఇందులో భాగంగా ముందుగా భర్తకు ఇష్టమైన పాయసంలో నిద్రమాత్రలు కలిపి తినిపించింది. అది తిన్న అతడు స్పృహ కోల్పోగానే, ఏమాత్రం జాలి లేకుండా గొంతు నులిమి హత్య చేసింది. బాత్‌రూమ్ కిందే...