​డాక్టర్‌ నిర్వాకం: ప్రాణాలమీదకు తెచ్చిన ఆపరేషన్లు.. బాధితుడికి రూ.19 లక్షల నష్టం!

ప్రభుత్వ ఆసుపత్రిలో నమ్మకంగా చికిత్స పొందుతున్న ఒక పేద వ్యవసాయ కూలి ప్రాణాలను ముప్పులోకి నెట్టి, ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిప్పి లక్షలాది రూపాయలు నష్టపోయేలా చేసిన ఒక డాక్టర్ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన లింగధరి రాజేశ్వర రావు (56) అనే వ్యవసాయ కూలికి ఈ ఏడాది జనవరి 24న తీవ్రమైన పొత్తికడుపు నొప్పి వచ్చింది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆయన వరంగల్‌లోని ఎం.జి.ఎం. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు (జనవరి 25న) అక్కడ ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అయితే ఆ ఆపరేషన్ విజయవంతం కాలేదు. ​ప్రైవేటు...