​సంజీవని ఆస్పత్రి సేవలు అమోఘం: మాజీ మంత్రి హరీశ్‌రావు

'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు, హీరో విజయ్ దేవరకొండ ​ఆస్పత్రి ట్రస్ట్‌కు తన ఏడాది జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్యే ​చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయడం అభినందనీయం ​ జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రి అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అమోఘమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. శనివారం ఆస్పత్రిలో నిర్వహించిన 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, వారి కుటుంబాల్లో కొత్త...