​మిడ్జిల్ నాటిన మొక్క... నేడు మహావృక్షమైంది!

​నాటి జెడ్పీటీసీ నమ్మకమే.. నేటి సీఎం పీఠం: కృతజ్ఞత సభలో రేవంత్ రెడ్డి భావోద్వేగం ​ఆనాడు నన్ను గుండెలకు హత్తుకున్నారు.. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోవాలని భట్టికి విజ్ఞప్తి ​దొరల దురహంకారాన్ని మళ్లీ బొందపెట్టాలి.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లపై ముఖ్యమంత్రి నిప్పులు ​ "ఆనాడు మిడ్జిల్ మండల ప్రజలు నాటిన చిన్న మొక్క.. ఇవాళ మహావృక్షమైంది. నా 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కీలకమైన ఈ ప్రాంత ప్రజల నమ్మకమే ఇవాళ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది" అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజకీయ ప్రస్థానానికి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్‌లో శనివారం నిర్వహించిన భారీ...