'భూభారతి'లో మహా దోపిడీ.. రాష్ట్రంలో తుగ్లక్ పాలన!

ధరణిని ముంచి.. 'భూభారతి'తో కోటి ఎకరాలు నిషేధిత జాబితాలోకి! ​దరఖాస్తుల్లేకుండానే 4,500 అప్లికేషన్ల ఆమోదం.. దీని వెనుక ఉన్నదెవరు? ​ సీఎం రేవంత్‌కు పరిపాలన చేతకాదు.. 20 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ దందాయే వచ్చు! ​ రెవెన్యూ మంత్రి పొంగులేటి తన కన్‌స్ట్రక్షన్ వ్యాపారాల్లో బిజీ: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర ఆరోపణలు ​ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ పోర్టల్ అక్రమాలకు అడ్డాగా మారిందని, రాష్ట్రంలో భూములను దోచుకోవడానికే ఈ కొత్త వ్యవస్థను తెచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్...