పేదల సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పట్టణ గృహ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి తొలి విడతగా 26 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు శాశ్వత భవనాలు అధికారుల సమీక్షలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఆదేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పట్టణ ప్రాంతాల గృహ నిర్మాణ పథకం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల శాశ్వత భవనాల నిర్మాణ పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...