'కాళేశ్వరం వైఫల్యానికి క్షమాపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకోండి ' కేటీఆర్ పర్యటన పై ఎమ్మెల్యే నాయిని ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పూర్తిగా వృథా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు.. •కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై కేటీఆర్ పర్యటనకు వెళ్లే ముందే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని, ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. •"మీరు చేసిన తప్పులను, అవినీతిని, వైఫల్యాలను ప్రజలు మర్చిపోతారని అనుకోవడం మీ భ్రమ" అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత కుటుంబ వ్యవహారాల్లోనే వివాదాలు...