ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం చెత్తబుట్టలోకి పోవడం ఖాయం: బిఆర్ఎస్ నేత దొగ్గంపూడి రంజిత్ రెడ్డి ఆగ్రహం

ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు తెల్లవారుజామున అరెస్టులు ఏంటి? పోలీస్ స్టేషన్లన్నీ మా కార్యకర్తలతో నిండిపోయాయి మరో రెండేళ్లే ఈ ప్రభుత్వం.. పోలీసులకు మేమే అండగా ఉంటాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దొగ్గంపూడి రంజిత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ కాళేశ్వరం పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేం ప్రశ్నించాలి.. మీరు సమాధానం...