హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులను వేగవంతం చేయండి: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు
మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేంద్రానికి విజ్ఞప్తి.. టిఓఆర్ ఖరారులో జాప్యంపై సీఎం ఆందోళన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు తక్షణమే అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి విడివిడిగా లేఖలు రాశారు. ఇటీవల జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల నిర్ణయాలను గుర్తు...