వాయుగుండంగా మారిన అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు!

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. బాలాసోర్ సమీపంలోని చాంద్‌బలి–దిఘా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపుగా ఇది పయనించనుంది. ​తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ​ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పలుచోట్ల...