మేడిగడ్డను వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణ అంతా నీళ్లు పారిస్తాం: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ​కేటీఆర్ మాట్లాడిన ప్రధానాంశాలు వారి మాటల్లోనే.. ​కుట్ర పూరితంగానే పిల్లర్ల కుంగుబాటు? ​"370 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజిలో కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అవి కూడా సరిగ్గా ఎన్నికల ముందే కేసీఆర్ గారి పేరును బద్నాం చేయడానికి ఎవరో కావాలనే చేశారనే బలమైన అనుమానం మాకు ఇప్పటికీ ఉంది." ​ఆ కుంగిన రెండు...