సిఎం పర్యటనకు ములుగు ముస్తాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ములుగు జిల్లాలో తలపెట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆమె వివిధ శాఖల ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ప్రతిపాదనలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమన్వయంతోనే లక్ష్య సాధన.. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ (ఐడీఓసీ), మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వీటితో పాటు...