బీసీ రిజర్వేషన్ల సాధనకు ఆగస్టు 6న హైదరాబాద్‌లో ‘మహాసభ’

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా వచ్చే నెల (ఆగస్టు) 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ నాయకుల కీలక సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు. ఆచార్య జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని ఈ సభకు ‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’గా నామకరణం చేసినట్లు తెలిపారు. ​దేశవ్యాప్త ఉద్యమానికి వేదిక.. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలలుగన్న సామాజిక న్యాయ తెలంగాణ ఆవిష్కరణ కోసం బీసీల హక్కుల పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. జనాభా దామాషా...