అవయవ మార్పిడి సేవలకు ‘టిమ్స్‌’ సిద్ధం

సనత్‌నగర్‌లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్‌)ను అన్ని రకాల అవయవ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్‌) శస్త్రచికిత్సలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లతో కలిసి టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ-ఆపరేటివ్, పోస్ట్-ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలతో పాటు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​దశలవారీగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు.. అనంతరం వైద్య నిపుణులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వ రంగంలోనే అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన...