కలెక్టర్ ‘చర్య’లకే తూట్లు! ‘సివిల్ సప్లై’ ప్రధాన కార్యాలయంలో తిరోగమన పోస్టింగులు
అవినీతి ‘టెక్నికల్ అసిస్టెంట్’కు మళ్లీ అందలం వరంగల్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు .. సివిల్ సప్లై కమిషనర్‌కూ తెలియకుండానే మాయాజాలం! మిల్లర్లతో కుమ్మక్కై నాసిరకం బియ్యం పాస్ చేసినా వెనకేసుకొచ్చిన ‘కీలక’ అధికారి, వరంగల్ మాజీ డీఎం ఏడాది తిరగకముందే భూపాలపల్లిలో తిష్ట వేసిన వైనం క్షేత్రస్థాయిలో అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగమే అవినీతిపరులకు అండగా నిలుస్తోంది. ఒక జిల్లా కలెక్టరు స్వయంగా రంగంలోకి దిగి, నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేసిన వైనాన్ని పట్టుకుని, సదరు ఔట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ (టి.ఎ)పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తే.. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్) ప్రధాన కార్యాలయంలోని కొందరు పెద్దలు దాన్ని తుంగలో...