వరంగల్ నూతన సీపీని కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతా రెడ్డి ని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సీపీకి పుష్పగుచ్ఛం అందజేసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ​కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకునే చర్యలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని శాంతిభద్రతల అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని కోరారు. దీనిపై సీపీ శ్వేతా రెడ్డి స్పందిస్తూ.. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.