పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు: సీఎం రేవంత్ రెడ్డి
నాచారంలో సరికొత్త 'బాలామృతం' ప్లాంట్ ప్రారంభం విద్యారంగంపై ఏటా రూ. 27 వేల కోట్ల పెట్టుబడి 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం హైదరాబాద్ జులై 7 (మన విశ్వం): ఈనాటి పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన తెలంగాణ, ప్రయోజకులైన దేశ పౌరులు ఎదుగుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన 'బాలామృతం' ప్లాంట్‌ను మంత్రి సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఉత్పత్తి, ప్యాకింగ్ యూనిట్లను పరిశీలించి, మొక్కను నాటారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.....