ఆయిల్‌పామ్ రైతులకు అండగా ఉంటాం: కేటీఆర్

బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక ప్రోత్సాహకాలు ​ ఆధునిక సాగు అధ్యయనానికి రైతులను మలేషియా పంపుతాం ​ కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ముంచుతోంది ​బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్‌పామ్ రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించి, అండగా నిలుస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయ రంగంలో పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు, రైతుల అనుభవాలు, వారి సమస్యలను ఈ సందర్భంగా కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ​తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్...