కమిషనర్‌కు తెలుసా.. కాపాడేస్తున్నారా?

కలెక్టర్ నివేదిక పక్కనబెట్టి.. అవినీతి 'టి.ఎ.'కు మళ్లీ పోస్టింగ్! ​పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో 'కీలక' అధికారి చక్రం! అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఈ విషయం తెలుసా? లేక నివేదికను మధ్యలోనే నొక్కేశారా? కలెక్టర్ల ఉత్తర్వులకే దిక్కు లేకపోతే క్షేత్రస్థాయిలో ఇక వ్యవస్థ ఎవరి కంట్రోల్‌లో ఉన్నట్లు? ​వరంగల్ ప్రతినిధి, జులై 7(మన విశ్వం): పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం కొంతమంది టి ఏ ల వల్ల అభాసుపాలవుంతోంది. కాసులకు కక్కుర్తిపడి, కొంతమంది మిల్లర్ లు తెచ్చే నాణ్యత లేని, పుచ్చు పట్టిన, రంగు మారిన బియ్యాన్ని గోదాముల్లోకి అనుమతిస్తున్నారు.సరిగ్గా ఇదే రీతిలో గతేడాది వరంగల్ జిల్లాలో...